
టీమిండియా యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాడు. బుచ్చి బాబు టోర్నీలో వరుసగా సెంచరీ (114), మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (41 నాటౌట్) ఆడిన ఇషాన్.. బ్యాట్‌తో సెలెక్టర్లకు సవాలు విసిరాడు. బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో భారత బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే ఖాళీ లేకుండా ఉంది. ఇప్పుడు ఇషాన్ కొత్తగా రేసులోకి వచ్చి సీనియర్ల స్థానాలను ప్రశ్నార్థకంగా మార్చాడు. భారత సెలెక్టర్లు బంగ్లాదేశ్ పర్యటనకు ఇషాన్‌ను ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.
Ishan Kishan - the hero of Jharkhand !!!
- Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024
బుచ్చి బాబు టోర్నీలో భాగంగా జార్ఖండ్, మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ను జార్ఖండ్ కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ స్టయిల్‌గా ముగించాడు. తన జట్టు గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇషాన్ విన్నింగ్ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment