టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రెడ్‌బాల్ క్రికెట్ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్ డైనమైట్. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్‌కే పరిమితం చేశారని ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రంజీల్లో ఆడనందుకు వేటు
మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తదుపరి కుటుంబంతో ట్రిప్‌నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.
ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్-2024లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్ బ్యాటర్... బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా తిరిగి రెడ్‌బాల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ డైనమైట్.. మధ్యప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు.
సిక్సర్‌తో సెంచరీ పూర్తి
సిక్సర్‌తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మూడు అద్భుత క్యాచ్‌లతో మెరిసి వికెట్ కీపర్‌గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్ కిషన్.
కాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ సెంచరీ కారణంగా జార్ఖండ్ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్ కెప్టెన్ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగమయ్యాడు.
చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్
ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!
Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024
Comments
Please login to add a commentAdd a comment