
జార్ఖండ్‌లో హిందీ పత్రిక జర్నలిస్టు అరెస్టు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అక్రమాల కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. శనివారం గుజరాత్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. జార్ఖండ్‌లో ఓ హిందీ పత్రిక జర్నలిస్టు జమాలుద్దీన్ అన్సారీని అరెస్ట్ చేశారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలామ్‌కు జమాలుద్దీన్ సహకరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
గుజరాత్‌లోని ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాల్లో నిందితులకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ్ జలారామ్ స్కూల్ ప్రిన్సిపాల్ పురుషోత్తమ్, టీచర్ తుషార్, మధ్యవర్తులు వి¿ోర్æ, అరిఫ్‌లను నాలుగు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గోద్రా కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గోద్రా, ఖేడా జిల్లాల్లో నీట్ పరీక్ష జరిగిన సెంటర్లు జయ్ జలారామ్ సూక్‌ల్ యాజమాన్యం ఆ«దీనంలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment