రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.
కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.
ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది
Comments
Please login to add a commentAdd a comment