సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. ఇవాళ (శుక్రవారం) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని నైనా దేవి ఆలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. నేడు తీవ్రవాదం అదుపులో ఉంది. బీజేపీ పాలన కేవలం అధికారంలో రావటామే కాదు. దేశాన్ని సురక్షితంగా ఉంచేలా చూస్తుంది. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై ఇది యుద్ధం సమయం కాదు. అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.
హర్యానాలో అధికారాన్ని నిలుపుకోవడానికి.. కాంగ్రెస్ కుట్రలు ఎదుర్కొని మరీ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక.. జమ్ము కశ్మీర్‌లో 90 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ చెప్పుకోదగ్గ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశాం. బీజేపీ అంటే అభివృద్ధి అని చూపించాం. విభజించి పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.
आज मुझे शारदीय नवरात्रों में नवमी के दिन मां नैना देवी का आशीर्वाद लेने का सौभाग्य प्राप्त हुआ।
हम सब लोग माता के आशीर्वाद से प्रधानमंत्री मोदी जी के विकसित भारत के सपने को पूरा करने में अपनी पूरी ऊर्जा के साथ कार्य करेंगे।
- श्री @JPNadda pic.twitter.com/LE0avEBDsm— BJP (@BJP4India) October 11, 2024
Comments
Please login to add a commentAdd a comment