నేను లంచాలు తీసుకోను.. తీసుకోనివ్వను
జూన్ 4 తర్వాత అవినీతిపై యుద్ధం ఉధృతం
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ
దుమ్కా: ‘‘బురద చల్లి మోదీని భయకంపితులను చేయగలమని ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు. వారు ఎంత ఎక్కువ బురద చల్లితే అన్ని ఎక్కువ కమలాలు విరగబూస్తాయి. ఆ సంగతి వారికి అర్థం కావడం లేదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విపక్ష నాయకుల బండారం తాను బయటపెడుతుండటంతో వారు తట్టుకోలేక తనపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి విపక్ష ‘ఇండియా’ కూటమి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
తాను జీవించి ఉన్నంతకాలం రిజర్వేషన్లను కాపాడుతానని ప్రకటించారు. మంగళవారం జార్ఖండ్‌లోని దుమ్కా, పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. జూన్ 4 తర్వాత అవినీతిపై యుద్ధం ఉధృతం చేస్తామని వెల్లడించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను లంచాలు తీసుకోనని, ఎవరినీ తీసుకోనివ్వనని తేలి్చచెప్పారు. ఒకవేళ ఎవరైనా లంచాలు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందేనని, ఇది తన కొత్త గ్యారంటీ అన్నారు.
‘లవ్ జిహాద్’ పుట్టింది జార్ఖండ్‌లోనే...
జార్ఖండ్‌లోని సంథాల్ పరగణాల్లో గిరిజనుల జనాభా తగ్గిపోతోందని, అక్రమ వలసలే ఇందుకు కారణమని ప్రధానిమంత్రి మండిపడ్డారు. జేఎంఎం ప్రభుత్వం అక్రమ వలసదార్లను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. అక్రమ వలసదార్లు గిరిజనుల భూములు కబ్జా చేస్తున్నారని, మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ‘లవ్ జిహాద్’ పదం మొదట జార్ఖండ్‌లోనే పుట్టిందన్నారు.
జేఎంఎం ప్రభుత్వం మత రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటు జిహాద్ చేసేవారిని సంతోషపర్చడానికి ఓబీసీ యువత హక్కులను కాజేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. బాగ్‌బజార్‌లోని శారదా మాత ఇంటిని దర్శించుకున్నారు. ఆమెకు నివాళులరి్పంచారు. అనంతరం శ్యామ్‌బజార్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులరి్పంచారు.
మూడు రోజులపాటు మోదీ ధ్యానం
⇒ ఈ నెల 30 నుంచి కన్యాకుమారి
⇒ వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయనున్న ప్రధాని
న్యూఢిల్లీ/చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజులపాటు ధ్యానం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నుంచి వచ్చే 1వ తేదీ సాయంత్రం దాకా తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ఆయన ధ్యానం చేస్తారని బీజేపీ నేతలు మంగళవారం వెల్లడించారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే.
ఈసారి ఆయన దక్షిణాదిని ఎంచుకున్నారు. స్వామి వివేకానందను మోదీ తన ఆధ్యాతి్మక గురువుగా భావిస్తుంటారు. కన్యాకుమారి రాక్ మెమోరియల్‌లో వివేకానంద మూడు రోజులపాటు ధ్యానం చేశారు. శివుడి కోసం పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేశారని చెబుతుంటారు. ఇప్పుడు అదే ప్రదేశంలో మోదీ ధ్యానం చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment