Pankaj Tripathi Lead Role In Atal Bihari Vajpayee Biopic - Sakshi
Sakshi News home page

Atal Bihari Vajpayee Biopic: అటల్‌ బిహారి వాజ్‌పేయి బయోపిక్‌లో ఆ నటుడు !

Published Fri, Jul 8 2022 7:51 PM | Last Updated on Fri, Jul 8 2022 9:07 PM

Pankaj Tripathi Lead Role In Atal Bihari Vajpayee Biopic - Sakshi

Pankaj Tripathi Lead Role In Atal Bihari Vajpayee Biopic: దివంగత భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో రూపొందనుంది. ఈ బయోపిక్‌కు 'మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే-అటల్‌' అనే టైటిల్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినోద్‌ భన్సాలీ, సందీప్ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉల్లేక్‌ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి: పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ బయోపిక్‌ చిత్రంలో ప్రధాన పాత్రలో విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాఠీ నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే పంకజ్‌ త్రిపాఠీ.. అటల్‌ బిహారీ వాజ్‌పేయిగా నటిస్తే కచ్చితంగా న్యాయం చేయగలరని సినీ విశ్లేషకులు చెబుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాను 2023, డిసెంబర్‌ల 25న అటల్‌ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement