ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్‌పేయి ఆదేశం! | Vajpayee wanted Pakistan Army camp hit after Parliament attack | Sakshi
Sakshi News home page

ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్‌పేయి ఆదేశం!

Published Sun, Jun 30 2019 4:56 AM | Last Updated on Sun, Jun 30 2019 9:54 AM

Vajpayee wanted Pakistan Army camp hit after Parliament attack - Sakshi

2001, డిసెంబర్‌ 13న పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన దాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్‌ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించారు. పాక్‌ తన శిబిరాన్ని వేరే చోటుకు మార్చడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అమెరికాపై అల్‌ ఖాయిదా దాడి(9/11) నేపథ్యంలో ఆఫ్ఘన్‌పై యుద్ధానికి దిగిన అమెరికాకు మద్దతివ్వాలని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌ అన్నారు. దానివల్ల క కలిగే నష్టాలను గుర్తించిన వాజ్‌పేయి దౌత్యనీతిని ఉపయోగించి నిర్ణయాన్ని దాటవేశారు. ‘ఏ ప్రైమ్‌ మినిస్టర్‌ టు రిమెంబర్‌: మెమరీస్‌ ఆఫ్‌ ఏ మిలటరీ చీఫ్‌(గుర్తుంచుకోదగిన ప్రధాని:సైన్యాధిపతి జ్ఙాపకాలు) పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్‌ కుమార్‌ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. పార్లమెంటుపై దాడి జరగ్గానే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, భద్రతా సలహాదారు బ్రజేశ్‌ మిశ్రాలతో సమావేశమయ్యారు. పీవోకేలో ఉన్న ఉగ్ర శిక్షణా శిబిరంపై దాడికి అన్ని నిర్ణయించాం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, పాకిస్తాన్‌ ఆ శిబిరాన్ని ఒక స్కూలు, హాస్పటల్‌ మధ్యకి మార్చినట్టు చివరి నిముషంలో తెలిసింది. శిబిరంపై దాడి చేస్తే జననష్టం జరుగుతుందన్న భావంతో ప్రధాని వాజ్‌పేయి దాడి చేయవద్దన్నారు. అని సుశీల్‌ తన 135 పేజీల పుస్తకంలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement