
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత ప్రధానికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ర్టీయ స్మృతిస్ధల్ వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర నేతలు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.
ఈ ఏడాది ఆగస్ట్ 16న అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ వాజ్‌పేయి మరణించిన సంగతి తెలిసిందే. కాగా వాజ్‌పేయి గౌరవార్ధం ఆయన బొమ్మతో ముద్రించిన రూ వంద నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వాజ్‌పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినంగా పాటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment