హరిద్వార్ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికలను ఆయన కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య ఆదివారం హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేశారు. దివంగత నేత మనుమరాలు నీహారిక, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ సందర్భంగా నమితా భట్టాచార్య వెంట ఉన్నారు. హరిద్వార్‌లో అస్తికలను కలిపే ముందు వారు ప్రేమ్ ఆశ్రమ్ సందర్శించారు.
వాజ్‌పేయి అస్థికలను అస్థి కలశ్ యాత్ర పేరుతో దేశంలోని వివిధ నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. రాష్ట్ర రాజధానులు, జిల్లా ముఖ్యకేంద్రాల్లో ప్రార్థనా సమావేశాలను నిర్వహిస్తారు. మరోవైపు వాజ్‌పేయి అస్థికలను ఈనెల 21 ప్రత్యేక విమానంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన లక్నో పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకువెళ్లనున్నారు.
ఈనెల 20న ఢిల్లీలో అఖిల పక్ష ప్రార్థనా సమావేశం, 23న లక్నోర్థీ తరహా సమావేశాలు నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌లో తీవ్ర అనారోగ్యంతో ఈనెల 16న తుది శ్వాస విడిచిన వాజ్‌పేయి భౌతిక కాయానికి మరుసటి రోజు అధికార లాంఛనాలతో ఢిల్లీలోని యమునా నదీ తీరాన రాష్ర్టీయ స్మృతిస్ధల్‌లో అంత్యక్రియలు జరిగాయి. అటల్ బిహారి అమర్ రహే నినాదాలు మిన్నంటగా ఆయన చితికి కుమార్తె నమితా భట్టాచార్య నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment