Ashes immersed
-
లత చితాభస్మ నిమజ్జనం
నాసిక్: పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్‌కుండ్‌లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చితాభస్మాన్ని గురువారం నిమజ్జనం చేశారు. లత సోదరి ఉష, మేనల్లుడు అదినాథ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు నాసిక్ వాసులు కూడా లతకు నివాళి అర్పించేందుకు వచ్చారు. గాయని లతా మంగేష్కర్(92) ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
ఉద్వేగానికి లోనైన బన్సూరి స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అస్థికలను ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ గురువారం యూపీలోని హపూర్ వద్ద గంగా జలాల్లో నిమజ్జనం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి స్వరాజ్ కౌశల్ వెంట రాగా బన్సూరి స్వరాజ్ ఈ క్రతువును నిర్వహించారు. 67 సంవత్సరాల సుష్మా స్వరాజ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అధికార లాంఛనాల నడుమ బుధవారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
హరిద్వార్‌లో వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం
హరిద్వార్ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికలను ఆయన కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య ఆదివారం హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేశారు. దివంగత నేత మనుమరాలు నీహారిక, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ సందర్భంగా నమితా భట్టాచార్య వెంట ఉన్నారు. హరిద్వార్‌లో అస్తికలను కలిపే ముందు వారు ప్రేమ్ ఆశ్రమ్ సందర్శించారు. వాజ్‌పేయి అస్థికలను అస్థి కలశ్ యాత్ర పేరుతో దేశంలోని వివిధ నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. రాష్ట్ర రాజధానులు, జిల్లా ముఖ్యకేంద్రాల్లో ప్రార్థనా సమావేశాలను నిర్వహిస్తారు. మరోవైపు వాజ్‌పేయి అస్థికలను ఈనెల 21 ప్రత్యేక విమానంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన లక్నో పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకువెళ్లనున్నారు. ఈనెల 20న ఢిల్లీలో అఖిల పక్ష ప్రార్థనా సమావేశం, 23న లక్నోర్థీ తరహా సమావేశాలు నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌లో తీవ్ర అనారోగ్యంతో ఈనెల 16న తుది శ్వాస విడిచిన వాజ్‌పేయి భౌతిక కాయానికి మరుసటి రోజు అధికార లాంఛనాలతో ఢిల్లీలోని యమునా నదీ తీరాన రాష్ర్టీయ స్మృతిస్ధల్‌లో అంత్యక్రియలు జరిగాయి. అటల్ బిహారి అమర్ రహే నినాదాలు మిన్నంటగా ఆయన చితికి కుమార్తె నమితా భట్టాచార్య నిప్పంటించారు. -
గంగా నదిలో వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం
-
కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం
ఇటిక్యాల: నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ అస్థికలను బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పుష్కరఘాట్‌పై పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య జానకిరామ్ కుమారుడు మాస్టర్ తారక రామారావు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణలతో కలసి అస్థికలను కృష్ణాన దిలో కలిపారు.