మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి గెలుపు రికార్డు ఘనంగానే ఉంది. ఎక్కువ స్థానాల నుంచి లోక్‌సభకు పోటీ చేయడంతో పాటు ఆయా స్థానాలన్నింటా విజయం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివరాల్లోకి వెళ్తే.. 1957 నుంచి 2004 వరకూ వాజ్‌పేయి ఆరు వేర్వేరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. మొదటిసారి 1957లో యూపీలోని బలరాంపూర్, మథురా నుంచి పోటీచేశారు. మథురలో ఓడిపోగా బలరాంపూర్‌లో విజయం సాధించారు. తర్వాత ఆయన వరుసగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, విదిష, న్యూఢిల్లీ, గుజరాత్‌లోని గాంధీనగర్, యూపీలోని లక్నో నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1984లో ఆయన గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవ్‌రావు సింధియా చేతిలో ఓడిపోయారు. మొత్తంగా వాజ్‌పేయి పదిసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. అత్యధికంగా లోక్‌సభకు ఎన్నికైన (11 సార్లు) రికార్డు మాత్రం ఇంద్రజిత్ గుప్తా పేరిటే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment