Indrajith
-
ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్‌ను తిరష్కరించటంపై ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వరుస ట్వీట్లతో స్పందిస్తూ.. ‘‘ కూతురి విషయంలో ఇలాంటి తీర్పును ఏ తండ్రీ భరించలేడు. నేను చచ్చిపోవాలి... రియా చక్రవర్తి బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఇక గురువారం సెషన్ కోర్టులో తదుపరి విచారణ... ఇక్కడో జీర్ణించుకోలేని నిజం ఏంటంటే. సుశాంత్ బ్రతికున్నట్లయితే డ్రగ్స్ కేసులో అతడే ప్రధాన ముద్దాయి. ( రియా చక్రవర్తి అరెస్ట్ ) అందరూ అతడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ‘ప్రచారం’ చేసిన పని కూడా ఇదే. ఓ గొప్ప నటుడి జీవితం డ్రగ్స్ వినియోగంతో ముడిపడి ఉంది’’ అని పేర్కొన్నారు. బుధవారం మరో ట్వీట్లో ‘‘ ఏలాంటి ఆధారాలు లేకుండా దేశం మొత్తం రియాను జైలుకు పంపటానికి పూనుకుందని’’ ఆవేదన వ్యక్తం చేశారు. ( సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు ) -
ఆరు సీట్లు..అటల్ ఫీట్లు..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి గెలుపు రికార్డు ఘనంగానే ఉంది. ఎక్కువ స్థానాల నుంచి లోక్‌సభకు పోటీ చేయడంతో పాటు ఆయా స్థానాలన్నింటా విజయం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివరాల్లోకి వెళ్తే.. 1957 నుంచి 2004 వరకూ వాజ్‌పేయి ఆరు వేర్వేరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. మొదటిసారి 1957లో యూపీలోని బలరాంపూర్, మథురా నుంచి పోటీచేశారు. మథురలో ఓడిపోగా బలరాంపూర్‌లో విజయం సాధించారు. తర్వాత ఆయన వరుసగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, విదిష, న్యూఢిల్లీ, గుజరాత్‌లోని గాంధీనగర్, యూపీలోని లక్నో నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1984లో ఆయన గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవ్‌రావు సింధియా చేతిలో ఓడిపోయారు. మొత్తంగా వాజ్‌పేయి పదిసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. అత్యధికంగా లోక్‌సభకు ఎన్నికైన (11 సార్లు) రికార్డు మాత్రం ఇంద్రజిత్ గుప్తా పేరిటే ఉంది. -
ఇంద్రజిత్ అజేయ సెంచరీ
►ఇండియా ‘రెడ్’ 291/9 ►‘బ్లూ’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్ కాన్పూర్: బాబా ఇంద్రజిత్ (181 బంతుల్లో 120 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘రెడ్’ తొలి రోజు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బుధవారం ఆట ముగిసే సమయానికి రెడ్ 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్ (36; 3 ఫోర్లు), సుదీప్ ఛటర్జీ (34; 4 ఫోర్లు, ఒక సిక్స్) తొలి వికెట్‌కు 70 పరుగులు జతచేశారు. ‘రెడ్’ జట్టు తరఫున ఆడుతున్న హైదరాబాద్ క్రికెటర్ సీవీ మిలింద్ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. బ్లూ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్ 3 వికెట్లు పడగొట్టగా, ఉనాద్కట్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంద్రజిత్తో పాటు విజయ్ గోహిల్ (22) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు చివరి వికెట్‌కు అభేద్యంగా 86 పరుగులు జోడించారు. -
నరకాసురుడు ఎవరు?
‘నేరమే నా నెత్తుటి వర్ణంరా... ద్రోహమే నా సృష్టిలో స్వర్గంరా...’ అంటూ ‘ధృవ’ సినిమాలో సై్టలిస్ట్ విలన్‌గా యాక్ట్ చేసి తనలోని కొత్త నటుణ్ణి బయటపెట్టారు అరవింద్ స్వామి. తాజాగా ఈ సై్టలిస్ట్ విలన్ తమిళ దర్శకుడు నరేన్ తెరకెక్కించనున్న ‘నరగాసురన్’లో యాక్ట్ చేయనున్నారు. ఇందులో సందీప్ కిషన్ యాక్ట్ చేస్తున్నారు. డార్క్ అండ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తెలుగులో ‘నరకాసురుడు’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు, ఇందులో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, ఇంద్రజిత్, శ్రియ నటిస్తున్నట్లు దర్శకుడు నరేన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెంటనే ‘గుడ్‌లక్ టు ఆల్ నరగాసురన్ టీమ్’ అని అరవింద్ ట్వీట్ చేశారు. మరి.. ఇందులో సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారా లేక మరేదైనా రోల్ చేస్తున్నారా? ఇంతకీ వెండితెర ‘నరకాసురుడు’ ఎవరో మరి?