బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి (ఫైల్‌ఫోటో)
లక్నో : బీజేపీ టార్గెట్‌గా బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రజల మధ్య విభజన చిచ్చు రాజేస్తున్నాయని ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిని బీజేపీ రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను నెరవేర్చకుండా అటల్జీ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమయ్యే ప్రతిపాదనను ప్రస్తావిస్తూ తమ పార్టీ ఏ రాష్ట్రంలో, ఎలాంటి ఎన్నికలకైనా పొత్తులకు సిద్ధంగా ఉందని, అయితే బీఎస్పీకి గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. తమకు తగినంతగా సీట్లు కేటాయించని పక్షంలో ఒంటరి పోరుకు దిగుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment