సాక్షి, లక్నో : యూపీలోని పూల్పూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అభ్యర్థులకు మద్దతిస్తామని బీఎస్‌పీ ప్రకటించడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తప్పుపట్టారు. ఎస్‌పీ, బీఎస్‌పీల మధ్య భాగస్వామ్యం పాము, ముంగిసల కలయిక వంటిదని అభివర్ణించారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల పరిస్థితికి ఇది అద్దంపడుతుందని వ్యాఖ్యానించారు. పూల్పూర్, గోరఖ్‌పూర్‌లో బీఎస్‌పీ అభ్యర్థులు పోటీలో ఉండరని, అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించే సత్తా ఉన్న అభ్యర్ధులకు తమ కార్యకర్తలు ఓటేస్తారని ఇందులో తప్పేమీలేదని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు రానున్న రాజ్యసభ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయని ఆమె వెల్లడించారు. గత ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం యోగి ఆదిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, పూల్పూర్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment