లక్నో : ఇండో-పాక్ ఉద్రిక్తతల మాటున ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చకుంటున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. పీఓకేలో జరిపిన వైమానిక దాడుల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో, సుపరిపాలన అందించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఘోరంగా విఫలమైందని పార్టీ నేతల భేటీలో మాయావతి ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ సర్కార్ అవలంభిస్తున్న ఎత్తుగడలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు. బీజేపీ కుయుక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని రానున్న లోక్‌సభ ఎన్నికలకు సన్నాహక సమావేశంగా ఏర్పాటు చేసిన భేటీలో మాయవతి పేర్కొన్నారు. ఎస్పీతో పొత్తుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని ఆమె ఈ సమావేశంలో తెలుసుకున్నారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ 38 స్ధానాల్లో ఎస్పీ 37 స్ధానాల్లో పోటీచేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment