
'అది కుట్ర.. నేనే అధ్యక్షుడిని'
తాను ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) అధ్యక్షుడినేనని.. ఇక ముందు కూడా కొనసాగుతానని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
శ్రీనగర్: తాను ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) అధ్యక్షుడినేనని.. ఇక ముందు కూడా కొనసాగుతానని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. సోమవారం ఆయనను పక్కన పెట్టి నిర్వహించిన జేకేసీఏ సమావేశం పూర్తిగా చట్టవిరుద్ధమని, కుట్రపూరిత చర్య అని అభివర్ణించారు. తనపై కుట్ర చేశారని పేర్కొంటూ ప్రత్యేక కాపీలను అందరికి పంచిపెట్టారు.
జేకేసీఏ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి మరి సమవేశం నిర్వహించారని, బలవంతంగా జేకేసీఏ చైర్మన్గా తనను నియమించేలా మహబూబ్ ఇక్బాల్ చేశారని ఆ కాపీల్లో అబ్దుల్లా ఆరోపించారు. ఓ రకంగా ఇక్బాల్ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన చేసిన పనికి గుర్తింపు లేదని, తానే జేకేసీఏకు అధ్యక్షుడినని, ఇకముందు కూడా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.