జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా కు అవయువమార్పిడి చికిత్స చేయనున్నారు.
శ్రీనగర్:జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా కు అవయవ మార్పిడి చికిత్స చేయనున్నారు. కిడ్నీలు విఫలం కావడంతో గత నాలుగు నెలలుగా లండన్ లో చికిత్స పొందుతున్న తన తండ్రి ఫరూఖ్ కు ఆదివారం అవయవ మార్పిడి చికత్స జరుగుతున్నట్లు ఒమర్ తెలిపారు.
ప్రస్తుతం తన ఆలోచనల్నీ తన తల్లిదండ్రులు చుట్టూనే ఉన్నాయని ఆయన అన్నారు. అవయవ మార్పిడి చికిత్స కారణంగా ఫరూఖ్ జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారానికి దూరమైనట్లు ఒమర్ తెలిపారు.