‘జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగానే ఉంది’ | Farooq Abdullah Says Centre Needs To Address The Root Cause Of Terrorism In Jammu And Kashmir - Sakshi
Sakshi News home page

‘జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగానే ఉంది’

Published Sun, Dec 24 2023 5:22 PM | Last Updated on Sun, Dec 24 2023 6:59 PM

Farooq Abdullah Says Centre Needs To Address The Root Cause Of Terrorism In J And K - Sakshi

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సంబంధించి బీజేపీపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా విర్శమలు గుప్పించారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాలేదని.. దానిని పూర్తిగా కూకటివేళ్లతో నిర్మూలించడానికి గల మూల కారణాలు గుర్తించాలన్నారు. ఆయన ఆదివారం ఓ పుస్తకావిష్కరణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందని కేంద్ర చెబుతోందని మండిపడ్డారు. కానీ ఇక్కడ ఇంకా శాంతి నెలకొనలేదని.. ఉగ్రవాద సమస్య సజీవంగానే ఉందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ ఉగ్రవాదం అంతమైనట్లు కేంద్రం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ఇక్కడ అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదం మూల కారణాన్ని గుర్తించాలన్నారు. 

ఉ‍త్తర కశ్మీర్‌లో బారాముల్లాలో ఉగ్రవాదుల దాడుల్లో మాజీ పోలీసుల అధికారి మొహమ్మద్ షఫీ మరణం పట్ల తాను తీవ్రంగా చింతిస్తునట్లు తెలిపారు.  జమ్మూ కశ్మీర్‌ శాంతి నెలకొందని చెప్పిన కేంద్రం ఇప్పుడు  ఎందుకు  మౌనంగా ఉందని మండిపడ్డారు. కేంద్ర కేవలం గాయాలకు మందు రాస్తుందని, దాని మూల కారణాన్ని గుర్తించడం లేదన్నారు.

సామాన్యులకు సైతం తాము సైనికులను, అధికారులను కోల్పోతున్నామని  అర్థం అవుతోందని తెలిపారు. కశ్మీర్‌లో రక్తపాతం అంతం చేడానికి కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయకుండా కశ్మీర్‌లో శాంతి నెలకొందని, పర్యటకం గురించి మాట్లాటం సరికాదని విమర్శించారు. 

చదవండి: తమిళనాడులో ఐటీ ఉద్యోగిని దారుణ హత్య.. ప్రియుడే కారణం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement