
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సబ్‌జైలుగా ప్రకటించిన ఆయన నివాసంలోనే మరో మూడు నెలలపాటు ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంలో ఉంటారని అధికారులు చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఎత్తివేస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్నాక ఫరూక్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి గృహ నిర్బంధంలో(ప్రజా భద్రతా చట్టం కింద) ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment