
మధ్యవర్తిత్వంతో ‘కశ్మీర్’ పరిష్కారం!
కశ్మీర్ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమస్య పరిష్కారానికి ‘మూడో వ్యక్తి’జోక్యం అవసరమన్నారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమస్య పరిష్కారానికి ‘మూడో వ్యక్తి’జోక్యం అవసరమన్నారు. మధ్యవర్తిత్వంతోనే ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించవచ్చని కేంద్రానికి సూచించారు. ‘మధ్యవర్తిత్వం అప్పగిస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని అమెరికా అధినేత ట్రంప్ పేర్కొన్నారు...
అందుకు మనం సిద్ధంగా లేం. అలాగే చైనా కూడా ముందుకొచ్చినా, మనం అంగీకరించడం లేదు’అని శుక్రవారం పార్లమెంట్ వద్ద మీడియాతో అన్నారు. ‘పాక్‌కు అణు బాంబులు ఉన్నాయి.. మీకు(భారత్) ఉన్నాయి. దీనివల్ల ఎంత మంది చనిపోవాలి’అని ప్రశ్నించారు. కశ్మీర్ సమస్యకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ట్రంప్ నేరుగా ఎక్కడా అనకున్నా.. ఐక్యరాజ్యసమితిలోని యూఎస్ రాయబారి నిక్కీ హెలీ ఏప్రిల్‌లో ఈ వాఖ్యలు చేశారు.