దశాబ్దాల కల నెరవేరుతోంది: మోదీ | Decades Of Wait For Ram Mandir Has Come To An End, Says PM Modi - Sakshi
Sakshi News home page

దశాబ్దాల కల నెరవేరుతోంది: మోదీ

Published Fri, Jan 19 2024 12:26 PM | Last Updated on Fri, Jan 19 2024 12:43 PM

Decades Of Wait For Ram Mandir Has Come To An End PM Modi Says - Sakshi

లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణంతో దశాబ్దాల కల నెలరవేరిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇన్నాళ్లుగా భక్తులు రామున్ని చిన్న గుడారంలోనే దర్శించుకున్నారని చెప్పారు  రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న దేశ వ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు. ప్రజలు తమ జీవితాల నుంచి పేదరికాన్ని తొలగించుకోవడానికి రామ జ్యోతి స్ఫూర్తినిస్తుందని మోదీ అన్నారు.

మూడోసారి బీజేపీ పాలనలో భారత్‌ను ప్రపంచంలోనే మూడో ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశ ప్రజలకు కచ్చితంగా హామీ ఇస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

రామ భజనలో నిమగ్నమైన దృశ్యాలను ప్రధాని మోదీ షేర్ చేశారు. "అయోధ్య రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు దేశం మొత్తం శ్రీరాముని పట్ల భక్తితో తడిసిముద్దయింది. నేపథ్య గాయకులు సురేష్ వాడ్కర్, ఆర్య అంబేకర్ తమ మధురమైన పాట ద్వారా భక్తుల భావాలను చిత్రీకరించారు" అని ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా తెలిపారు.

రామ మందిర కార్యక్రమానికి ముందు మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు.  నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది.

ఇదీ చదవండి: రాముడి కోసం.. నిద్రాహారాలలో కఠిన నియమాలు పాటిస్తున్న మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement