అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్ | Prabhas Donates Rs 50 Crores To Ayodhya Ram Mandir Ahead Of Inauguration? Check Here's The Truth - Sakshi
Sakshi News home page

Prabhas-Ayodhya Ram Mandir: అయోధ్యలో ఫుడ్ కోసం ప్రభాస్ రూ.50 కోట్ల ఖర్చు.. నిజమేంటి?

Published Fri, Jan 19 2024 6:12 PM | Last Updated on Sat, Jan 20 2024 5:44 PM

Prabhas Team Respond On Ayodhya Ram Mandir Food Distribution - Sakshi

డార్లింగ్ ప్రభాస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఫుడ్. ఎందుకంటే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారంటే తోటి నటీనటులకు వెరైటీ ఫుడ్ పెట్టి షాకయ్యేలా చేస్తారు. అయితే గత కొన్నిరోజుల నుంచి ప్రభాస్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఇచ్చే ఫుడ్ కోసం కోట్ల రూపాయాలు విరాళమిచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతిష్టాత్మక రామ మందిర ప్రారంభోత్సవం.. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరనుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌కి కూడా ఇన్విటేషన్ వచ్చిందని తెలుస్తోంది. అయితే డార్లింగ్ మాత్రం ప్రారంభోత్సవం రోజు.. అయోధ్యకు వచ్చే భక్తులకు ఇచ్చే ఫుడ్ ఖర్చంతా భరిస్తున్నాడని.. దీనికి మొత్తంగా రూ.50 కోట్లు అయ్యిందని మాట్లాడుకున్నారు.

ఈ వార్తలపై  ఇంగ్లీష్ మీడియా, ప్రభాస్ టీమ్‌ని సంప్రదించగా.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ స్పష్టత వచ్చేసినట్లు అయింది. ఇకపోతే తెలుగు సినీ ప్రముఖుల్లో చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులకు ఆహ్వానాలు అయితే వచ్చాయి. వీళ్లలో ఎవరెవరు అయోధ్యకు వెళ్తారనేది చూడాలి.

(ఇదీ చదవండి: అయోధ్యలో బాలరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట.. అతిథుల జాబితా ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement