న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జనవరి 22న అయోధ్యకు వెళ్తారా అన్న ప్రశ్నకు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కేజ్రీవాల్ మోదీతో పాటు 22నే రాముడి గుడికి ఎందుకు వెళ్లాలి. 23,24వ తేదీల్లో ఎందుకు వెళ్లకూడదు. రాముడు ఎప్పుడైనా అక్కడే ఉంటాడు. మీకు భక్తి ఉంటే ఆఫీసులో ఉండి కూడా రాముడిని పూజించవచ్చు. ప్రతి ఒక్కరు మోదీతో వెళ్లాలి, మోదీతో కూర్చోవాలనేమీ లేదు.
అయితే కేజ్రీవాల్ 22న వెళ్తారా లేదా అనేది ఆయన షెడ్యూల్‌కు సంబంధించిన అంశం. అది నాకు తెలియదు. ప్రతి ఒక్కరు రాముని గుడికి వెళ్లాలి. అయితే ప్రధాని మోదీతో కలిసి మాత్రం కాదు’ అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కాగా కేజ్రీవాల్ గురువారం నుంచి మూడు రోజుల పాటు గోవాలో పర్యటించనున్నారు.
VIDEO | "I am not sure about this. I believe it's important to go but going (to Ayodhya) when PM Modi is going there is not necessary. People are going there for Lord Ram, so they can attend whenever they wish to," says Delhi Minister and AAP leader @Saurabh_MLAgk when asked… pic.twitter.com/dFmRcyjoiO
— Press Trust of India (@PTI_News) January 17, 2024
Comments
Please login to add a commentAdd a comment