
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ శనివారం జారీ చేసిన మెమోరాండంను ఢిల్లీ ఎయిమ్స్ వెనక్కి తీసుకుంది.
అవుట్ పేషెంట్ సేవలు(ఓపీడీ)సహా అన్ని విభాగాలు యథావిధిగా తెరిచి ఉంచాలంటూ ఆదివారం తాజాగా మెమోరాండం జారీ చేసింది. అన్ని కేంద్రాల, విభాగాల అధిపతులు, యూనిట్లు, బ్రాంచ్ ఆఫీసర్లు తమ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఈ సమాచారం అందజేయాలని కోరింది. రోగులకు అసౌకర్యం కలగరాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓపీడీ సహా అన్ని సేవలు సోమవారం రోజంతా యథావిధిగా కొనసాగుతాయని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ కూడా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment