గుడిని శుభ్రం చేసిన బాలీవుడ్‌ బ్యూటీ.. రామ్‌ వచ్చేయ్‌ అంటూ.. | Kangana Ranaut Sweeps Temple Floor in Ayodhya | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: అయోధ్య రాజు వచ్చేస్తున్నాడంటూ కంగనా పోస్ట్‌.. ప్రత్యేక యాగం..

Published Sun, Jan 21 2024 4:57 PM | Last Updated on Sun, Jan 21 2024 6:01 PM

Kangana Ranaut Sweeps Temple Floor in Ayodhya - Sakshi

శతాబ్దాల కల సాకారం కానుంది. సోమవారం(జనవరి 22) అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్‌ దేశం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానాలు అందాయి. అందులో కంగనా రనౌత్‌ కూడా పేరు కూడా ఉంది. ఇంకేముంది, వెంటనే అక్కడ వాలిపోయిందీ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌. సిల్క్‌ చీర కట్టుకుని బంగారు నగలు ధరించి అయోధ్యలో హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది.

ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటి
గుడి ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేసింది. అనంతరం అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'రామా.. ఇకనైనా వచ్చేయ్‌.. ఈ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన ఆధ్వర్యంలో హనుమంతుడి యాగం చేశాను. అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.

ప్రస్తుతం ఆ సినిమాలో..
చాలా కాలం తర్వాత అయోధ్య రాజు తన స్వస్థలానికి రేపు తిరిగివస్తున్నాడు. వచ్చేయ్‌ రామా.. వచ్చేయ్‌' అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించింది. కాగా కంగనా రనౌత్‌ చివరగా తేజస్‌ సినిమాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆమె ప్రస్తుతం ఎమర్జన్సీ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు కావాలి.. అప్పుడు సంతోషంగా లేను, అందుకే..

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement