సోమవారం బాలరాముని ్ర‘పాణప్రతిష్ట సందర్భంగా శోభాయమానంగా అయోధ్య ఆలయం. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, భక్తజన సందోహం.
సాక్షి, అయోధ్య: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన అద్భుత, చరిత్రాత్మక ఘట్టం వైభవోపేతంగా, నిరి్వఘ్నంగా జరిగింది. అయోధ్య భవ్య మందిరంలో రామ్‌లల్లా సోమవారం మధ్యాహ్నం ప్రాణప్రతిష్ట జరుపుకున్నాడు. దివ్యమంగళ రూపంతో, మందస్మిత వదనంతో ఐదేళ్ల నీలమేఘ రాముడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ప్రత్యక్షంగా వేలాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో ఈ వేడుకను కనులారా తిలకించి ఆనంద పరవశులయ్యారు.
బంగారు ధనస్సు, బాణంతోపాటు విలువైన స్వర్ణ వజ్రాభరణాలు, పూల దండలు, తులసి మాలలతో అద్భుతంగా అలంకరించిన మర్యాద పురుషోత్తముడి విగ్రహం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ప్రధాన యజమాని(కర్త) హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు. అటంకాలేవీ లేకుండా అనుకున్న ముహూర్తానికే గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది.
ఈ కార్యక్రమం తర్వాత నూతన భవ్య మందిరంపై సైనిక హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడంటూ ప్రధానమంత్రి మోదీ అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయోధ్యలో జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు
అయోధ్యలో ప్రాణప్రతిష్ట ఉత్సవాలు సోమవారం ఉదయమే మొదలయ్యాయి. అతిథులు, ప్రముఖులు ఉదయం నుంచే బారులు తీరారు. సంప్రదాయ సంగీత కళాకారులు రాముడి భక్తి గీతాలు ఆలపించారు. సంగీత వాయిద్యాలతో ఆహూతులకు ఆధ్యాతి్మక పరిమళాలు పంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి తొలుత అయోధ్య ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. పట్టు వ్రస్తాలు, పూజా ద్రవ్యాలతో మధ్యాహ్నం ఆలయం లోపలికి అడుగుపెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్‌తో కలిసి గర్భగుడి ఎదుట కొన్ని క్రతువులు నిర్వహించారు.
అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించారు. మోదీ వెంట భాగవత్‌తో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా, జైశ్రీరామ్ అనే నినాదాలు మార్మోగుతుండగా గర్భాలయం లోపల నరేంద్ర మోదీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల వ్యవధిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించారు. విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికనుంచి మోదీ ప్రసంగించారు.
కుబేర తిల శివాలయంలో మోదీ పూజలు
రామమందిరంలో ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. శివలింగానికి జలాభిõÙకం నిర్వహించారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రాచీన కుబేర తిల ఆలయాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. బాధ్యతల నిర్వహణలో జటాయువు పట్టుదలను ఆయన గుర్తుచేసుకున్నారు.
11 రోజుల అనుష్ఠానం విరమించిన ప్రధాని మోదీ
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను ముగించారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్‌గిరి మహారాజ్ ప్రధానికి చరణామృతం (ఉపచారాలకు వాడే పాలతో చేసిన తీపి పానీయం) ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన పాదాలకు ప్రధాని పాదాలకు సమస్కరించారు. ఉపవాస దీక్షను కొనసాగించిన మోదీ భక్తిని దేవ్‌గిరి ప్రశంసించారు. అనుష్ఠానం ఆసాంతం మోదీ కటిక నేలపై శయనిస్తూ కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. రోజూ గంటా 11 నిమిషాల పాటు మంత్ర జపం, ధ్యానం చేశారు.
రామాలయ కారి్మకులకు ఘనంగా సన్మానం
అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన కారి్మకులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. ప్రాణప్రతిష్ట అనంతరం కారి్మకులపై ఆయన కృతజ్ఞతాపూర్వకంగా పూలు చల్లారు. దాంతో ప్రాణప్రతిష్టకు హాజరైన వంద మందికి పైగా కార్మికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment