కష్టాలు వస్తే మానవులు చిగురుటాకులా వణికిపోతుంటారు. కానీ సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడికీ కష్టాలు తప్పలేవు. తన ఇంటిని, రాజ్యాన్ని వదిలి పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేశాడు. ఎన్నో గడ్డు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు, విషమ పరీక్షలను దాటాడు. ఆ ధీశాలి అయోధ్యవాసి. కానీ అక్కడేం జరిగింది. దాదాపు 500 ఏళ్లుగా తనకంటూ నిలువనీడ లేకుండా పోయింది. ఈసారి రాములవారికి కష్టం వచ్చిందని మానవులే ఒక్కటయ్యారు, పోరాడారు. శతాబ్దాల పోరాటం అనంతరం ఆయనకు గుడి నిర్మించారు.
అయోధ్యలో పుట్టిన నేను..
సోమవారం (జనవరి 22న) శ్రీరాముడి విగ్రహప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా జరుపుకుంటోంది అశేష జనం. ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. 'రాముని జన్మస్థలమైన అయోధ్యలో పుట్టిన నేను ప్రాణ ప్రతిష్ట వేడుకను తిలకించటం అదృష్టంగా భావిస్తున్నాను. నాతో సహా భారతీయులందరికీ ఇది గర్వించదగ్గ విషయం. ఈ పండగ వాతావరణంలో నేను రామ్ పరివార్ జ్యువెలరీ ధరించడం సంతోషంగా ఉంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కేవలం అయోధ్యలోనే కాదు దేశమంతా ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతా ఒక్కటే
దేశమంతా ఏకతాటిపైకి వచ్చి రాముడి రాకను సంబరాలు చేసుకుంటోంది. ఇది మనందరినీ ఏకం చేసే ఉత్సవం. ఇది మనలో ఐకమత్యాన్ని, అన్ని వర్గాలవారూ ఒక్కటే అన్న భావాన్ని పెంపొందిస్తుంది. మనసులో భక్తిని నింపుకుందాం.. అయోధ్యలోనే కాకుండా దేశమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం.. జై శ్రీరామ్' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు చీరకట్టులో ఉన్న ఫోటోను జత చేసింది. ఇందులో అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఆమె ధరించిన రామ్ పరివార్. శ్రీరామపట్టాభిషేకాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్న ఈ ఆభరణాన్ని ధరించి అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది లావణ్య.
Comments
Please login to add a commentAdd a comment