సాక్షి, సూర్యాపేట: అయోధ్యలో జరగబోయే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాము కూడా రామ భక్తలమేనని గుర్తు చేశారు. శనివారం సూర్యాపేటలో పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ఈవెంట్‌గా మారుస్తున్నాయని విమర్శించారు.
‘శంకరాచార్యులు, మఠాధిపతులు కొంతమంది రామమందిర ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు ఎవరు బరిలోకి దిగినా 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి యజ్ఞం మెరుగ్గా కొనసాగుతోంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తాం.
అరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. గత ప్రభుత్వంలా కాకుండా, వివక్ష లేకుండా రాజకీయ పక్షపాతం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికి అందిస్తాం’ అని ఉత్తమ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment