అయోధ్య: బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలో నగరమంతటా పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ట వేదిక వద్ద, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో మోహరించారు. ఆలయం చుట్టూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు బిగించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆయోధ్యకు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్ కారిడర్‌లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. ఫైజాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాంటీ డ్రోన్ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment