ఢిల్లీ: అయోధ్యలో రామ మందరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ.. ఉగ్ర కలకలం రేగింది. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది.
భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో భాగంగా ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రరిస్ట్ స్వ్వాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. అయితే ఆ ముగ్గురి వివరాల్ని గానీ.. విచారణకు సంబంధించిన విషయాలపైగానీ ఇంకా ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్‌లల్లా
పటిష్ట భద్రత
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి 11 వేల మంది అతిథులుగా హాజరు కానున్నారు. ఆహ్వానం వెళ్లిన వాళ్లలో రాజకీయ, సినీ, క్రీడా రంగానికి ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో యూపీ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. పది వేల మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పహారాలో.. సీసీ కెమెరాల నిఘా నీడలో అయోధ్య ఉందిప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment