న్యూఢిల్లీ: అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభ వేడుక ఫక్తు రాజకీయ కార్యక్రమమని కాంగ్రెస్ విమర్శించింది. ఇంకా నిర్మాణం పూర్తికాని గుడిని కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టకుని బీజేపీ ప్రారంభిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రియా ష్రినేట్, పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు.
జ్యోతిర్ మఠం చీఫ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కూడా రామ మందిర వేడుకకు రావడం లేదని ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గుడిలో రాముని విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించలేదని అందుకే శంకరాచార్య వేడుకకు రానని ప్రకటించారని ఖేరా చెప్పారు.
పూర్తిగా నిర్మాణం జరగని గుడిలో రామునికి ప్రాణ ప్రతిష్ట ఎలా జరుపుతారని నలుగురు శంకరాచార్యలు ఇప్పటికే ప్రశ్నించారన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా ఒక రోజు రామ మందిరాన్ని సందర్శిస్తారని ఖేరా తెలిపారు. ‘దేవునితో ఒక వ్యక్తి ఆడే రాజకీయ డ్రామాను మేం అంగీకరించం’అని ఖేరా స్పష్టం చేశారు.
కాగా,ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకకు దూరంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు హాజరవకపోవడం కాంగ్రెస్ మూర్ఖత్వానికి నిదర్శనం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
ఇదీచదవండి.. నాసిక్‌లో మోదీ ఆధ్యాత్మిక పర్యటన.. భక్తులతో కలిసి రాం భజన
Comments
Please login to add a commentAdd a comment