అయోధ్యలో కోహ్లిని పోలిన వ్యక్తి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం! వీడియో | Virat Kohli duplicate felt like the original in Ayodhya | Sakshi
Sakshi News home page

అయోధ్యలో కోహ్లిని పోలిన వ్యక్తి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం! వీడియో

Published Tue, Jan 23 2024 1:35 PM | Last Updated on Tue, Jan 23 2024 2:38 PM

Virat Kohli duplicate felt like the original in Ayodhya - Sakshi

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కనుల పండువగా జరిగింది. యావత్తు దేశం మొత్తం రామనామ జపంతో మార్మోగిపోయింది. ఈ ప్రాణప్రతిష్ట వేడుకను ప్రత్యేకంగా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. పలువరు క్రికెట్లరు సైతం ఈ అద్బత ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు అయోద్యకు వెళ్లారు.

సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, వెంకటేశ్‌ ప్రసాద్‌ వంటి క్రికెట్‌ దిగ్గజాలతో పాటు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అయోద్య పుర వీధుల్లో కన్పించారు. అయితే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,  స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లికి  ఆహ్వానం అందినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ హాజరు కాలేకపోయారు.

కానీ విరాట్‌ కోహ్లిని పోలిన ఓ వ్యక్తి మాత్రం అయోద్యలో సందడి చేశాడు. అచ్చెం విరాట్‌లనే అతడు ఉండడంతో అభిమానులు సెల్ఫీలు కోసం ఎగబడ్డారు. అతడు తను కోహ్లిని కాదని చెబుతునప్పటికీ.. జనం మాత్రం ఫోటోల కోసం వెంటబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో​ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్‌ కోహ్లి  కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా దూరమయ్యాడు.
చదవండి: IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement