అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. కాంగ్రెస్‌ నిర్ణయం ఇదే | Congress Wont Attend Ram Temple Event In Ayodhya On January 22, Know Reason Inside - Sakshi
Sakshi News home page

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. కాంగ్రెస్‌ నిర్ణయం ఇదే

Published Wed, Jan 10 2024 4:31 PM | Last Updated on Wed, Jan 10 2024 5:22 PM

Congress Wont Attend Ram Temple Event In Ayodhya On January 22 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య​ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతుందా లేదా అనే సందిగ్ధతకు పార్టీ తెర దించింది. జనవరి 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట  కార్యక్రమానికి హాజరు కావొద్దని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటన విడుదల చేశారు. 

రామమందిరం ప్రతిష్ట కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారని కాంగ్రెస్‌ వెల్లడించింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్ని మోదీ సర్కార్‌ పొలిటికల్‌ ప్రాజెక్టుగా మార్చిందని విమర్శలు గుప్పించింది. 

ఎన్నికల లబ్ధి కోసం అసంపూర్తిగా ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వెల్లడించింది. మతం వ్యక్తిగత అంశమని, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పింది. 
చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement