చిన్న వయసులోనే తల్లి నుంచి సంగీతం నేర్చుకుంది షల్మాలీ ఖోల్గాడే. ఆమె తల్లి ఉమా ఖోల్గాడే శాస్త్రీయ గాయని. ప్రసిద్ధ రంగస్థల కళాకారిణి. యూఎస్‌లో వోకల్ మ్యూజిక్ కోర్సు చేసిన షల్మాలీ బాలీవుడ్ సినిమా ‘ఇష్క్‌జాదే’లో పరేషాన్ పాటతో బాగా పాపులర్ అయింది. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకుంది.
‘గతంలో పోల్చితే చాలామంది గాయకులు తమ స్వరాలకు తామే పాట రాసుకుంటున్నారు. గొంతు ఇస్తున్నారు. ఆ పాటల్లో ఒక్క పాట హిట్ అయినా అవకాశాలు మన అడ్రస్ వెదుక్కుంటూ వస్తాయి. కోవిడ్‌కు ముందు కోవిడ్ తరువాత సంగీతాన్ని గురించి చెప్పుకోవాలంటే కోవిడ్ విరామంలో చాలామంది తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకున్నారు.
ఆడియో వోటీటీకి ఆదరణ పెరగడం శుభపరిణామం. మ్యూజిక్ అంటే ఫిల్మ్ మ్యూజికే కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు కూడా మంచి ఆదరణ ఉంది’ అంటుంది షల్మాలీ ఖోల్గాడే.
Comments
Please login to add a commentAdd a comment