ఎలాంటి సంగీత నేపథ్యం లేకున్నా పాటను చక్కగా ట్యూన్ చేయగలదు. ఆమె పాటలను రాసి ట్యూన్ చేసి పాడేస్తుంది. అవే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫేమస్ అయ్యింది. అదే సినీ ఇండస్ట్రీలోకి వచ్చేల చేసింది. అంతేకాదండోయ్ ఫేమస్ పాట 'జిందగీ' పాడింది కూడా ఈమెనే. ఆమె ఎవరంటే..
లాక్‌డౌన్ కాలంలో దొరికిన విరామంలో ఎంతోమంది తమలోని క్రియేటివ్ టాలెంట్స్‌ను మెరుగు పరుచుకున్నారు. అలాంటి వారిలో హనియా ఒకరు. కేరళలోని కోచికి చెందిన హనియా నసిఫా లాక్‌డౌన్‌లో ఖాళీ సమయం దొరకడంతో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ‘నాకు ఎలాంటి సంగీత నేపథ్యం లేదు. అయితే పాటలను రాసి ట్యూన్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించేది. అలా పాటలనేవి నా దిన్యచర్యలో భాగం అయ్యాయి’ అంటుంది హానియా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ట్రాక్స్ వైరల్ అయ్యాయి. ఇది హానియాను లైమ్‌లైట్‌లోకి తీసుకువచ్చింది.
‘నా షార్ట్ మ్యూజిక్ క్లిప్స్‌కు వేలల్లో వ్యూస్ రావడం మొదలు కావడంతో మరింత ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుంచి పాటలను ప్రొఫెషనల్‌గా రికార్డ్ చేయడం ప్రారంభించాను. మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ను అప్‌గ్రేడ్ చేశాను’ అంటుంది ఇరవై సంవత్సరాల హనియా. హనియా తన టాలెంట్‌తో సోషల్ మీడియా నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. మన తెలుగు సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ‘జిందగీ’ అనే పాటను పాడింది.
Comments
Please login to add a commentAdd a comment