డాల్లస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఫణి నారాయణ వీణా వడలి ‘‘ శ్రీ ఫణి నారాయణ వీణా మహతీ స్రవంతి’’ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. సెయింట్ మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీలో సెప్టెంబర్ 14న ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులు ఫణి నారాయణ, విద్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్ని, చినసత్యం వీర్నపు తదితర టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం ఆలపించిన కృష్ణాష్టకం ప్రారంభ గీతం అందరినీ ఆకట్టుకుంది. గాయిని సాయితన్మయ అద్భుతమైన ప్రతిభతో మరికొన్ని శాస్త్రీయ గీతాలు పాడి అందరి మన్ననలు పొందారు.
అనంతరం ఫణినారాయణ వీణా ప్రస్థానం వీనుల విందుగా సాగింది. ఆయన వీణపై వాయించిన ‘‘ వటపత్ర సాయికి వరహాల లాలి’’ ‘‘కథగా కల్పనగా కనిపించెను నాకొక యువరాణి’’ ‘‘పరువం వానగా’’ ‘‘సుభలేఖ రాసుకున్న’’ ‘‘తకిట తకిట తందాన’’ ‘‘ సామజ వరగమన’’ ‘‘ ఈగాలి ఈనేల’’ వంటి పాటలు అందరినీ తన్మయత్వానికి గురిచేశాయి. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహేశ్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుదుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం, కళ్యాణి తాడిమేటిలు ముఖ్య అతిధులు ఫణినారాయణ వీణా వడలి, విధ్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్నిలను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. ఫణినారాయణ టాంటెక్స్ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన రఘురాం బుర్ర, బాల గునపవరపు, జయ కళ్యాణి, పూజిత కడిమిశెట్టిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, మన టీవీ, టీఎన్‌ఐ, ఫన్ ఏషియా, దేసీప్లాజ, తెలుగు టైమ్స్, ఐఏసియాలకు, సెయింట్. మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నల గడ్డ, డా. తోటకూరి ప్రసాద్, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఫణినారాయణ వీణా మహా స్రవంతి
Published Sat, Sep 21 2019 12:57 PM | Last Updated on Sat, Sep 21 2019 1:04 PM
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment