ట్యూన్‌ టోన్‌ కలిసెన్‌ | Ilayaraaja Live Concert in Chennai on 2nd June 2019 | Sakshi
Sakshi News home page

ట్యూన్‌ టోన్‌ కలిసెన్‌

Published Tue, May 28 2019 12:14 AM | Last Updated on Tue, May 28 2019 5:19 AM

Ilayaraaja Live Concert in Chennai on 2nd June 2019 - Sakshi

ఇళయరాజా, యస్పీ బాలసుబ్రహ్మణ్యం

కొన్ని కాంబినేషన్లు భలే కుదురుతాయి. అందులో ఎవర్‌గ్రీన్‌ కాంబినేషన్‌ అంటే ఇళయరాజా – యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకటి. రాజా కంపోజిషన్‌లో యస్పీబీ క్లాసిక్‌ సాంగ్స్‌ పాడారు. రాజా ట్యూన్, యస్పీబీ టోన్‌ అద్భుతః అనుకున్నారు ప్రేక్షకులు. అయితే ఈ బ్యూటిఫుల్‌ కాంబినేషన్‌కు ఆ మధ్య చిన్న గ్యాప్‌ వచ్చింది. ‘నా పాటలను నా అనుమతి లేకుండా ఏ వేదిక మీద పాడినా నాకు రాయల్టీ ఇవ్వాలి’ అని ఇళయరాజా స్టేట్‌మెంట్‌ జారీ చేశారు.

‘రాజా పాటలు పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరు’ అని యస్పీబీ అన్నారు. ఈ వివాదం అలా సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించారట. చిన్న ఆలింగనంతో అలకలకు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ కలిసున్న ఫొటోలను యస్పీబీ తనయుడు యస్పీ చరణ్‌ షేర్‌ చేశారు.  వచ్చే నెలలో ఇళయరాజా బర్త్‌డే (జూన్‌ 2) సందర్భంగా జరగబోయే లైవ్‌ కాన్సెర్ట్‌లో ఈ ఇద్దరూ కలసి పెర్ఫామ్‌ చేయబోతారని తెలిసింది. ఇది సంగీతప్రియులకు నిజంగా శుభవార్తే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement