Vikky The Rockstar: వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా..? | First Shade From Vikky The Rockstar Movie Unveiled | Sakshi
Sakshi News home page

Vikky The Rockstar: వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా..?

Published Thu, Jul 21 2022 6:10 PM | Last Updated on Thu, Jul 21 2022 6:10 PM

First Shade From Vikky The Rockstar Movie Unveiled - Sakshi

విక్రమ్‌, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విక్కీ ది రాక్‌ స్టార్‌’. సిఎస్ గంటా దర్శకత్వంలో  శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా  ఈ చిత్రం నుంచి ఫస్ట్ షేడ్‌ను విడుదల చేశారు.

‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం.. వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా.. అమృతా’ అంటూ ఎమోషనల్‌గా సాగే ఈ ఫస్ట్‌ షేడ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల షూటింగ్‌ ముగించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.‘ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేశాం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నాం’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా..సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement