
కోర్టునుంచి వస్తున్న అస్గర్ అలీ, సుభాష్‌శర్మ
సాక్షి, నల్లగొండ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విచారణ 23వ తేదీకి వాయిదా పడింది. నల్లగొ ండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో సాగుతున్న ఈ కేసుకు సంబంధించి చార్జీషీట్ వేశారు. అయితే వాదనలకు ముందుజరిగే చార్‌్జఫ్రేమ్ కార్యక్రమం మంగళవారం జరగాల్సి ఉంది. కాగా ప్రణ య్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సమాచారాన్ని పోలీసులు ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తికి అందజేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!)
కాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. చార్‌్జఫ్రేమ్ చేస్తే ఇరుపక్షాల నుంచి పోలీసులు మోపిన అభియోగాలను నిందితులకు వినిపించి వాదనల షెడ్యూల్డ్‌ను ఖరారు చేయాల్సి ఉండగా మారుతీరావు ఆత్మహత్యతో వాయిదా పడింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కుమార్ మినహా సుభాష్‌శర్మ, అస్గర్‌అలీతో పాటు అబ్దుల్‌బారీ, కరీం, శివ, నిజాంలను పోలీసులు హాజరుపరిచారు. కేసు వాయిదా అనంతరం వారిని తిరిగి జిల్లా జైలుకు తీసుకెళ్లారు. ('అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ')
Comments
Please login to add a commentAdd a comment