సాక్షి, మిర్యాలగూడ : కూతురు అమృత తన వద్దకు వస్తుందని మారుతీరావు చివరి వరకు ఆశపడ్డారు. కానీ ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందాడు. క్షణికావేశంలో అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేయించి జైలు పాలైన మారుతీరావు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మారుతీరావు మృతదేహానికి ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడలోని తన నివాసంలో ఉంచారు. కాగా ఉదయం బంధువులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. మారుతీరావు మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన భార్య గిరిజను పరామర్శించారు. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రాజీవ్‌చౌక్ మీదుగా షాబ్‌నగర్ శ్మశానవాటికకు చేరుకుంది. మారుతీరావు చితికి ఆయన తమ్ముడు తిరునగరు శ్రవణ్ తలకొరివి పెట్టాడు.
(‘మొన్నరాత్రి మారుతిరావు నాకు ఫోన్ చేశాడు’)
అమృతను అడ్డుకున్న బంధువులు
తండ్రి మృతదేహాన్ని చూడటానికి షాబ్‌నగర్‌లోని శ్మశానవాటిక వద్దకు చేరుకున్న అమృతను మారుతీరావు బంధువులు అడ్డుకున్నారు. ఆమె ఇంటి నుంచే పోలీసు బందోబస్తుతో పోలీసుల వాహనంలోనే శ్మశానవాటికకు చేరుకుంది. కా గా ఆదివారం చనిపోతే ఇంటికి రాకుండా శ్మశానవాటిక వద్దకు రావడమేంటని, గో బ్యాక్ అ మృత.. మారుతీరావు అమర్ రహే అంటూ ని నాదాలు చేశారు. కాగా పోలీసులు కూడా చేసేది లేక అమృతను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
పరామర్శించిన పలువురు నాయకులు
మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో సోమవారం ఆయన నివాసం వద్ద పలువురు నాయకులు మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన భార్యను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు శ్మశానవాటిక వరకు చేరుకున్నారు. శ్మశాన వాటిక వద్దకు అమృత వచ్చే సందర్భంగా ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావుకు సూచించారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, నల్లమోతు భాస్కర్‌రా>వు తనయుడు సిద్ధార్థ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మి ల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, బీజేపీ నాయకులు కర్నాటి ప్రభాకర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య సంఘ నాయకులు రేణుకుంట్ల గణేష్‌గుప్తా, చిల్లంచర్ల విజయ్‌కుమార్, ముత్తింటి వెంకటేశ్వర్లు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మోసిన్‌అలీ, కాంగ్రెస్ మున్సిపల్‌ఫ్లోర్ లీడర్ బత్తుల లక్షా్మరెడ్డి తదితరులున్నారు. ('మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు')
ఏరియా ఆస్పత్రికి అమృత...
అమృత ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అస్వస్థతకు గురైంది సదరు టీవీ చానల్ వారు అమృత బాబాయ్ శ్రవణ్‌ను ఫోన్ ద్వారా లైన్‌లోకి తీసుకుని డిబెట్ ఏర్పాటు చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అమృత ఆవేషానికి లోనై కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో నీరసంతో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment