వారి వల్లే ఇంకా బ్రతికున్నాం: ప్రణయ్‌ తండ్రి | We Will Fight Until Get Justice Says Pranay Father | Sakshi
Sakshi News home page

వారి వల్లే ఇంకా బ్రతికున్నాం: ప్రణయ్‌ తండ్రి

Published Fri, Feb 1 2019 4:22 PM | Last Updated on Fri, Feb 1 2019 5:38 PM

We Will Fight Until Get Justice Says Pranay Father - Sakshi

సాక్షి, హైదరాబాద్: మీడియా, పోలీసుల సహకారంతోనే తాము ఈ రోజు బ్రతికున్నామని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు. కొంతమంది వ్యక్తులు రకరకాలుగా తమ కుటుంబం వెంట పడుతున్నారని, అయినా అమృత తమ వెంటే ఉంటుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బాలస్వామి మాట్లాడుతూ.. తమను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో తెలియటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అమృత బాబుకి జన్మనిచ్చిందని తెలిపారు. బాబు ఆరోగ్యం కూడా చాలా బాగుందన్నారు.

ప్రాణం పోయినా తాము పోరాడతామని, చిన్న కొడుకు కూడా ధైర్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. ‘న్యాయం వైపు వెళ్తున్నాం.. నాకు ఏమైనా.. నా కుటుంబానికి ఏం జరిగినా సరే మేము పోరాడుతా’ మని అన్నారు. కచ్చితంగా దోషులకి శిక్ష పడే వరకు తాము పోరాడతామని చెప్పారు. కులం కారణంగానే తమ కొడుకు చంపబడ్డాడన్నారు. మిర్యాలగూడలో కూడా ఇప్పటికి తమ గురించి వెతుకుతున్నారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement