
ఆ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడొచ్చు
సాక్షి, హైదరాబాద్ : మారుతి రావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన వ్యక్తిగత లాయర్ వెంకట సుబ్బారెడ్డి అన్నారు. తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో మారుతిరావు తనతో మాట్లాడారని, కేసుపై చర్చించారని చెప్పారు. కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందుకు రావడం మారుతిరావును కలిచివేసిందని, విచారణను వాయిదా వేయించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రణయ్ ఎస్సీ కాదని నిరూపించేందుకు ప్రయత్నం చేశారని,కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి తనకు ఇచ్చినట్టు లాయర్ పేర్కొన్నారు.
(చదవండి : బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత)
ఎస్సీ, ఎస్టీ కేసుపై మంగళవారం హైకోర్టులో కేసు వేయాలకున్నామని.. ఇంతలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆస్తి పంపకాల విషయాలను ఎప్పుడు తనతో చర్చించలేదన్నారు. ప్రణయ్ కేసులో శిక్ష పడుతుందని మారుతీరావుకు తెలుసునని.. ఆ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడొచ్చని అభిప్రాయపడ్డారు. మారుతిరావుతో తనకు ఏడేళ్ల పరిచయం ఉందన్నారు. మారుతిరావు భార్య గిరిజ కూడా గతంలో తనను కలిసిందని, చాలా బాగా మాట్లేడదని వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
చదవండి :
డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది..
మారుతిరావు ఆత్మహత్య