
మాట్లాడుతున్న శ్రవణ్
సాక్షి, హైదరాబాద్ : మిర్యాలగూడ పరువు హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన తమ్ముడు శ్రవణ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అన్నకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. విభేదాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. చివరగా అన్నతో మే 15న మాట్లాడాను. అడ్వకేట్‌ని మాట్లాడుకోవడానికి కూడా సమయం లేకపోవడంతో ఒత్తిడికి గురయ్యారేమో. మా అన్నతో విభేదాలు లేవు కానీ, అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే ఆయనతో మాట్లాడటం లేదు. నా కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో నేను మాట్లాడటం లేదు.
మీడియా ఊహించి రాయొద్దని విజ్ఞప్తి. ఉదయం కారు డ్రైవర్ ఫోన్ చేశారు. విషయం తెలియగానే మా వదినని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాను. సూసైడ్ నోట్‌లో ఏముందో తెలియదు. మిర్యాలగూడ షెడ్డులో దొరికిన మృతదేహానికి మాకు సంబంధం లేదు. ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారా లేదా అనేది నాకు తెలియద’న్నారు.
చదవండి : అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు: అమృత
Comments
Please login to add a commentAdd a comment