వారికి బెయిలిస్తే నాకు రక్షణుండదు: ‍అమృత | Amrutha Talk On Pranay Murder Case MIryalaguda | Sakshi
Sakshi News home page

వారికి బెయిలిస్తే నాకు రక్షణుండదు: ‍అమృత

Published Thu, Oct 25 2018 10:25 AM | Last Updated on Thu, Oct 25 2018 11:14 PM

Amrutha Talk On Pranay Murder Case MIryalaguda - Sakshi

అమృత వర్షిణి

సాక్షి, మిర్యాలగూడ అర్బన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ పరువు హత్య కేసు నిందితులకు నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. ప్రణయ్‌ హత్య అనంతరం పోలీసులు నమో దు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 అబ్దుల్‌బారీ, ఏ5 కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్, ఏ7 శివ బెయిల్‌ కోసం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టులో పిటిషన్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. వారికి బెయిల్‌ తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రణయ్‌ భా ర్య అమృతవర్శిణి, ప్రణయ్‌ తండ్రి బాలస్వామి కోర్టుకు హాజరయ్యారు. నిందితులకు బెయిల్‌ ఇవ్వరాదని ఎస్సీ, ఎస్టీ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ మోకిని సత్యనారాయణగౌడ్‌ వాదించినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు.

బెయిల్‌ ఇవ్వొద్దని న్యాయమూర్తిని వేడుకున్న అమృత
నల్లగొండ లీగల్‌ :  అమృత వర్షిణి న్యాయమూర్తి హుస్సైబ్‌ హైమద్‌ ఖాన్‌ ఎదుట హాజరై ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బెయిల్‌ ఇస్తే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తమకు రక్షణ ఉండదని ఆమె ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement