గోవాలో రాజకుమారుడు | Anaganaga O Rajakumarudu in regular shooting | Sakshi
Sakshi News home page

గోవాలో రాజకుమారుడు

Published Wed, Jan 17 2018 12:28 AM | Last Updated on Wed, Jan 17 2018 12:28 AM

Anaganaga O Rajakumarudu in regular shooting - Sakshi

నవీన్‌బాబు హీరోగా సంజన, అమృత హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. హాస్యనటుడు సుమన్‌ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షెరాజ్‌ దర్శకత్వంలో రమాదేవి సమర్పణలో పీవీ రాఘవులు నిర్మిస్తోన్న ఈ చిత్రం గోవాలో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. షెరాజ్‌ మాట్లాడుతూ – ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోవా నేపథ్యంలో కథ ఉంటుంది. త్వరలో హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ మొదలు పెట్టి, పాటలు, మిగతా సన్నివేశాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా–ఎడిటింగ్‌: ఏకరీ లక్కీ, సంగీతం–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: షెరాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement