
సాక్షి, నల్గొండ : మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అమృత తండ్రి మారుతీరావు మరణం అనంతరం.. శనివారమే ఆమె తల్లి గిరిజను కలిశారు. ( పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత )
Comments
Please login to add a commentAdd a comment