జయలలిత (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయలాజికల్ శాంపిల్స్ తమ వద్ద లేవని ఆమె చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన అమృత తాను జయలలిత కుమార్తెను అంటూ ముందుకురావడంతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వైద్యనాధన్ కోరిన వివరాలకు బదులిస్తూ ఆస్పత్రి యాజమాన్యం ఈ మేరకు నివేదించింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించిన విషయం తెలిసిందే.
అంతకుముందు కేసు విచారణ సందర్భంగా అమృత వాదనలకు జయ మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపలు అభ్యంతరం తెలిపారు. జయలలిత కుమార్తెను తానేనంటూ అమృత చేస్తున్న వాదనకు ఎలాంటి ఆధారాలూ లేనందున పిటిషనర్ కేవలం సివిల్ కోర్టునే ఆశ్రయించాలని అన్నారు. అమృత పోయెస్ గార్డెన్స్ నివాసంలో జయలలితను కలిసినట్టు లేదా జయలలిత బెంగళూరు పర్యటనల సందర్భంగా అమృతను కలిసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా కేసు తదుపరి విచారణను కోర్టు జూన్ 4కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment