ప్రణయ్ హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎంపీ
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : ప్రణయ్ చట్టాన్ని తీసుకువచ్చేంత వరకూ పోరాడుతామని మాజీ ఎంపీ, విముక్తి చిరుతల కక్షి జాతీయ అధ్యక్షుడు తిరుమావలవన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ప్రణయ్ కుటుం బానికి 50వేల రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా ప్రణయ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించి పెళ్లి చే సుకున్నందుకు హత్య చేయడం సరైంది కాదన్నారు. ప్రణయ్ కుటుం బా నికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆ యన వెంట కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు, మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, హరిజనవాడల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, మేడి కొండ విజయ్ తదితరులున్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి)
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అమృత
మిర్యాలగూడ అర్బన్ : హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిని బుధవారం రాత్రి ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ సదానాగరాజును కలిశారు. ప్రణయ్ పోస్టుమార్టం రిపోర్టును ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యుల గురించి వస్తున్న అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఫిర్యాదు చేస్తే ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అలాంటి పోస్టులు పెట్టేవారిని గుర్తిస్తామని సీఐ చెప్పడంతో త్వరలోనే ఫిర్యాదు అందచేస్తామని తెలిపినట్లు సమాచారం. ప్రణయ్‌కు సంబంధించిన డెత్ సర్టిఫికట్ కోసమే పోస్టుమార్టం రిపోర్టు కావాలని కోరినట్లు సీఐ తెలిపారు. (మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ)
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment