special law
-
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాను మళ్లీ రెచ్చగొట్టింది. ఈసారి క్షిపణి పరీక్షతో కాదు.. అంతకు మించిన చర్యతో. అణ్వాయుధ బలగాలను విపరీతంగా పెంచుకునేలా ఏకంగా ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకుంది. తద్వారా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో తొక్కి.. అణు ఆయుధాలను అపరిమితంగా తయారు చేసుకునే చట్టాన్ని రూపొందించారు. తద్వారా.. ప్యాంగ్యాంగ్తో ఆర్థిక సాయం విషయంలో నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు అమెరికా చేసిన అభ్యర్థనను ఆయన తేలికగా తీసుకున్నట్లు అయ్యింది. గురువారం ఉత్తర కొరియా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ జరిగింది. ఈ సమావేశంలో.. కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్ర పక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాంగ్యాంగ్ అణు ఆశయాలను అణిచివేసేందుకు, దాని వ్యవస్థను నాశనం చేసేందుకు అమెరికా, దాని భాగస్వాముల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి తాను ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీపీఆర్కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం ద్వారా ఉత్తర కొరియా అపరిమితంగా అణ్వాయుధాల్ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. అణ్వాయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, వాటిని వివిధ సేవల్లో ఉపయోగించుకోవడం లాంటి అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరోవైపు ఈ చర్యపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది. -
యూఏఈ సంచలన చట్టం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. దశాబ్దాలుగా సాగుతున్న ‘కుటుంబాల వ్యాపార’ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఒకవేళ చట్టం విదేశీ కంపెనీలు నేరుగా అక్కడ వ్యాపారలావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కలగనుంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. యూఏఈలో చాలాఏళ్లుగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. కమర్షియల్ ఏజెన్సీ అగ్రిమెంట్ల సాయంతో విదేశీ కంపెనీలన్నింటిని ఈ కుటుంబాలే నడిపిస్తూ వస్తాయి . అయితే ఆ అగ్రిమెంట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌కు పుల్‌స్టాప్ పెట్టేలా యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టం తేనుంది. ఇప్పటికే చట్ట రూపకల్పన జరిగిపోయిందని, ఎమిరేట్స్ నాయకత్వం దానిని ఆమోదం తెలపడం మాత్రమే మిగిలిందని ఆ కథనం వెల్లడించింది. అయితే ఎప్పటిలోపు ఆ చట్టం తీసుకురాబోతున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత కొరవడింది. ఇదిలా ఉంటే ఈ గల్ఫ్ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్ డీలర్‌షిప్‌ల దాకా ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒకవేళ తాజా చట్టం గనుక అమలులోకి వస్తే మాత్రం.. విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే యోచనలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు. చదవండి: వీకెండ్ సెలవుల్ని మార్చేసిన యూఏఈ. ఎప్పుడో తెలుసా? -
క్రిప్టోకరెన్సీ.. కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్‌ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ. క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చదవండి: క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసా? -
అనాథలకోసం ప్రత్యేక చట్టం
నాగోలు: అనాథల కోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నా రు. నాగోలు తట్టిఅన్నారంలోని జె–కన్వెన్షన్‌లో జరుగుతున్న ఫోర్స్ ఫర్ ఆర్ఫన్స్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ (ఫోర్స్) అంతర్జాతీయ సదస్సు రెండో రోజు ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అనాథల అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా కృషిచేస్తానని తెలిపారు. గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనాథ విద్యార్థులకు సర్టిఫికెట్ల కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తే, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అనాథాశ్రమాలు నడిపే ప్రతినిధులంతా ఢిల్లీ వస్తే ఈ విషయంపై ఇతర శాఖ మంత్రులతో చర్చించి వారి అభివృద్ధికి కావలసిన చర్యలు తీసుకుందామని తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, అనాథల సంక్షేమానికి స్వచ్చంధ సంస్థలతో పాటు రాజకీయ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనాథలను ఆదుకోవడానికి వెంకటస్వామి ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. -
ప్రణయ్ చట్టం కోసం పోరాడుతాం
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : ప్రణయ్ చట్టాన్ని తీసుకువచ్చేంత వరకూ పోరాడుతామని మాజీ ఎంపీ, విముక్తి చిరుతల కక్షి జాతీయ అధ్యక్షుడు తిరుమావలవన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ప్రణయ్ కుటుం బానికి 50వేల రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా ప్రణయ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించి పెళ్లి చే సుకున్నందుకు హత్య చేయడం సరైంది కాదన్నారు. ప్రణయ్ కుటుం బా నికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆ యన వెంట కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు, మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, హరిజనవాడల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, మేడి కొండ విజయ్ తదితరులున్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అమృత మిర్యాలగూడ అర్బన్ : హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిని బుధవారం రాత్రి ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ సదానాగరాజును కలిశారు. ప్రణయ్ పోస్టుమార్టం రిపోర్టును ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు ఫేస్బుక్, వాట్సాప్‌లలో అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యుల గురించి వస్తున్న అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఫిర్యాదు చేస్తే ఫేస్బుక్, వాట్సాప్‌లలో అలాంటి పోస్టులు పెట్టేవారిని గుర్తిస్తామని సీఐ చెప్పడంతో త్వరలోనే ఫిర్యాదు అందచేస్తామని తెలిపినట్లు సమాచారం. ప్రణయ్‌కు సంబంధించిన డెత్ సర్టిఫికట్ కోసమే పోస్టుమార్టం రిపోర్టు కావాలని కోరినట్లు సీఐ తెలిపారు. (మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ) చదవండి: అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! -
హైటెన్షన్’ బాధిత రైతులకోసం ప్రత్యేక చట్టం
కోదండరాం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో బాధిత రైతుల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమా వేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు కోల్పో యిన రైతుల కోసం తెచ్చిన చట్టం మాదిరిగా విద్యుత్ లైన్ల కోసం భూములు కోల్పోయిన వారికోసం కొత్తగా చట్టాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 400 కేవీ, 765 కేవీ లైన్ల కోసం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో భూములు కోల్పోతున్నారని అన్నారు. కానీ ఆయా సంస్థలు అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయన్నారు. చట్టప్రకారం పరిహారం పంపిణీపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ... వాటిని అమలు చేయలేదన్నారు. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పరిహారం కావాలని ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు పక్షం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఇదిలా ఉండగా బాధిత రైతులు సర్పంచ్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఉద్యమ కమిటీలు ఏర్పాటు చేశారు. -
ద్వేషపూరిత నేరాలకు ప్రత్యేక చట్టం
యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ లక్నో: విద్వేషపూరిత నేరాల కట్టడికి నూతన చట్టం తీసుకొస్తామని బుధవారం విడుదల చేసిన యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే మహిళలు, ఓబీసీలు, మైనారిటీలపై కూడా వరాల జల్లు కురిపించింది. విభజన శక్తులను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్–ఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొంది. ఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించింది. బీజేపీ విద్వేష, విభజనపూరిత ఎజెండా ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టమౌతోందని పేర్కొంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. కులం, మతం పేరుతో ఘర్షణలు రేపే వారికి కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేక చట్టం. పోలీస్ అంబుడ్స్‌మన్ నియామకం. బాలికలకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు వచ్చే నాటికి రూ.50 వేల– రూ.లక్ష అందించేలా ‘కన్య సశక్తికరణ్ యోజన’ అమలు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. రైతులకు, చేనేతలకు రుణాలు. 50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు.